శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Tuesday 12 June 2012

ప్రకృతి సూత్రాలు :18 వ సార్వత్రిక నియమం


                                             జీవులన్నింటి మధ్య పాదార్థిక బంధం వుంది.
                                                 (All Life Forms are Connected).
     జీవులన్నీ పరిణామ క్రమంలో ఉద్భవించాయని మనకు తెలుసు.పరిణామమనే జీవ వృక్షంలో రెండు ప్రధాన మైన కొమ్మలున్నాయి.ఒకటి వృక్ష జాతి.మరొకటి జంతు జాతి.ఈ రెండు జాతుల్లో దేనికీ చెందని మిగిలిన జాతులు కూడా ఆ పెను జీవ వృక్షానికి అంటుకునే వున్నాయి.
         వృక్ష జాతులనే అతి పెద్ద కొమ్మలో పలు శాఖలు ఉన్నాయి.అవి ఎన్నోకుటుంబాల రూపంలో ఉండవచ్చును. ఆ శాఖలు మళ్ళీ శాఖోపశాఖలై అన్ని రకాల వృక్ష జాతులకు ఆలంబనగా వుంది.అలాగే ఆ మహావృక్షంలోని మరో కొమ్మ జంతు జాతి.అందులోమళ్ళీ ఎముకలు లేని జీవులు(invertibrates),ఎముకలున్నజీవులు(vertibrates) అనే రెండు ప్ర ధాన గ్రూపులున్నాయి.ఇవన్నీమళ్ళీ ఎన్నోవర్గాలుగా వున్నాయి.ఈ శాఖల్లో కోతులు,మానవుడుండే క్షీరదాల శాఖ అందులో మళ్ళీ primates శాఖలు ఉద్భవించాయి.కాబట్టి ఆ వృక్షపు ప్రధాన శాఖలు ,ఉపశాఖలు ఆ తర్వాతి శాఖోప శాఖల్లో ఉన్నఅన్ని రకాల జీవులు సందానించబడి ఉన్నాయనే అర్థం కదా!
   ఈ ఉదాహరణ ప్రకారం భౌతికంగా అన్నీ కలిసి ఉన్నట్టు అర్థం కాదు.ఈ కాలగమనంలో పరిణామక్రమంలో ఎక్కడో ఎప్పుడో ఒకప్పుడు అవి,ఇవీ అన్నీ బంధువులే !ఒక కుటుంబంలో వంశ వృక్షమని ,వారి మధ్య ఏదో ఒక విధమైన రక్తసంబందాన్ని (blood relation) చూడగలుగుతున్నాము.అలాగే ఇంకా వెనక్కిపోతే మనుషులందరికీ సంబంధం ఉన్నట్లు అర్థం.
  కాలగమనంలో ఒక చోటునుంచి కోతులు,మనుష్యులు అటు ఇటు పరిణామం చెందారు,కాబట్టి కోతులు మనుషులు మధ్య కూడా పాదార్థిక (he,she తదితర జన్యు బాంధవ్యం )ఉండే ఉండాలి.కోతులకు మనుషులకు,అమీబాలకు ఆ తర్వాత యుగ్లీనా,అల్గేలకు,అక్కణ్ణించి వేప చెట్లకు గోంగూరకు కూడా జన్యు పరంగా దూర బంధుత్వం ఉన్నట్లు అర్థం.ఇలా జంతువులకు,వృక్షాలకు,మనుషులకు బంధుత్వం ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.ఇక మనుషులంతా బంధువులు అని చెప్పటానికి సందేహమే లేదు.

2 comments: