శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Monday 30 April 2012

ప్రకృతి సూత్రాలు: 4 వ సార్వత్రిక నియమం

ఈ విశ్వం లో కేవలం నాలుగు రకాల బలాలు మాత్రమే వున్నాయి.అవి 
ఎ.గురుత్వాకర్షణ బలాలు
బి.విద్యుదయస్కా౦తబలాలు 
సి.బలమైన కేంద్రక బలాలు
డి.బలహీనమైన కేంద్రక బలాలు 
(There are are Only Four Operating Forces in the Universe;they are 
(a)Gravitational forces;
(b) Electromagnetic Forces;
(c)Srong Nuclear Forces
(d)Weak Nuclear Forces
          విశ్వంలో జరిగే ప్రతి సంఘటన పై నాలుగు బలాల్లో ఏదో ఒకటి లేదా కొన్నింటి ప్రభావం వుంటుంది.ఈ  నాలుగిం టిని మించిన బలమేదీ ఈ విశ్వం లో లేదు.ఉన్నట్లు ఏ ఆధారాలు లేవు.
 ఎ)గురుత్వాకర్షణ బలాలు: 
      ప్రతి పదార్థానికి  ద్రవ్యరాశి వుంటుంది.ద్రవ్యరాశి వున్నఏదేని రెండు పదార్థాల మధ్య పనిచేసే బలాన్ని గురుత్వా కర్షణ బలం అంటాము.భూమి తనంత తానుగా సూర్యుడి చుట్టు తిరగటానికి కారణం ఇదే!నక్షత్రాల కదలికలు, సముద్రపు ఆటుపోటులు,పై నుండి వస్తువు క్రిందకు పడటం దీని వలననే! 
బి)విద్యుదయస్కాంత బలాలు:
     విద్యుత్తు,అయస్కాంతత్వం ఒకే నాణేనికి రెండు పార్స్వాల్లాంటివి.విద్యుత్తు వలన  అయస్కాంతత్వం, అయ స్కాంతం  లోని కదలికలవల్ల విద్యుత్తు జనిస్తాయి.ఈ  రెండు కలగలిసి వుంటాయి. ఉదా:రసాయనిక చర్యలు,జీవ చర్యలు ,ఎలెక్ట్రిక్ మోటర్,జెనరేటర్, పనిచేయడం.మనం పీల్చే గాలిలోని ఆక్షిజెన్  రక్తం లోని హీమోగ్లోబిన్ తో కలవ టానికి కారణం అయస్కాంతత్వం వల్లే!  శరీరం లోని మెదడు నుండి నాడులకు సంకేతాలు విద్యుత్తు రూపం లో వెళ్తాయి ఉదా:కంప్యూటర్,టి.వి,సెల్ పోన్  
సి)బలమైన  కేంద్రక బలాలు:
      పరమాణువులోని కేంద్రకం లో వున్న  ప్రోటాన్స్ వికర్శించుకుంటాయి.అవి విడి పోకుండా బంధించి ఉంచేవి కేంద్రక బలాలు.నాలుగు గ్రాముల హీలియం లో వున్న బలమైన కేంద్రక బలాలతో 5 టన్నుల బరువున్న10 to the power of 24  ట్రక్కులను ఒక సెకనులో పది మీటర్ల ఎత్తుకు లేప వచ్చు.ఈ  బలమైన  కేంద్రక  బలాల ప్రభావం వల్లననే కేంద్రక ,విచ్చిత్తి,కేంద్రక సంలీనం జరుగుతున్నాయి.విద్యుదయస్కాంత  బలాలకన్న గురుత్వాకర్షణ బలా లు ఎన్నో లక్షల కోట్ల రెట్లు బలహీనమైననవి.విద్యుదయస్కాంత బలాలు బలమైన కేంద్రక బలాల కన్నాసుమారు 1400 రెట్లు బలహీన మైనవి.
డి)బలహీన మైన కేంద్రక బలాలు:
ఇవి కేంద్రకం లో క్వార్కులన బడే మరింత చిన్న మౌలిక కణాల్ని పట్టి ఉంచుతాయి.ఇవి గురుత్వాకర్షన బలాల కన్నా లక్షల కోట్ల రెట్లు బలమైనవి.బలమైన కేంద్రక బలాలకన్నా ఇవి కేవలం లక్ష రెట్లు మాత్రమే బలహీనమైనవి.
                 ఈ నాలుగు రకాల బలాలు తప్ప మరే ఇతర బలాలు లేవన్నది ఈ నియమ సారాంశం.

Sunday 29 April 2012

ప్రకృతి సూత్రాలు:3వ సార్వత్రికనియమం


     ఈ విశ్వం లో ఏదీ స్థిరంగా లేదు.ప్రతిది చలనం లో వుంది. వస్తువు శాశ్వతం కాదు.చిన్నదైనా,పెద్దదైనా ప్రతిది మార్పు చెందవలసిదే .మారనిదేదీ విశ్వం లో లేదు.కేవలం మార్పు మాత్రమే శాశ్వతం.గతిలో లేని దానికి  విశ్వం లో స్థితి లేదు.(Nothing in the Universe is Eternal;Nothing is static;Everything,smaall or Big,Has to Change.No Object is permanent.Only Change is Permanent).
         విశ్వం  లో  వున్నా    వస్తువులన్నీ  ,వ్యవస్థలన్నీ  మారుతుంటాయి .గాలీ ,నీరు  కదులుతుంటాయి .ఘన  పదార్థాలలోని పరమానువుల్లో కదలిక ఉవంది.పర్వతాలు,భుఖందాల్లో కదలిక లున్నాయి సౌరమండలం      ,పాలపుంత మొత్తం గిరగిరా తిరుగుతుంది..విశ్వం గమనం లో వుంది.విశ్వం విస్తరిస్తూ వుంది.మనిషి శరీరంలో కణాలున్నాయి. వాటిలో కదలిక వుంది.మరణం తర్వాత శరీరం లోని అణువులు,కణాలు గాలిలో ,నీటిలో భూమిలో కలవడం కదలిక లో భాగమే!కాలం కదులుతుంటే పదార్థంలో మార్పులు జరుగుతుంటాయి.కొన్ని మార్పులు నెమ్మదిగా కొన్ని త్వరగా జరుగుతాయి.మార్పు లేనిదంటూ ఏదీ లేదు.
      మార్పు ఎందుకు జరుగుతుంది?పదార్థం లోని అంశాలు పరస్పరం నియంత్రించుకుంటాయి.పరమాణువులో నున్న   ప్రోటాన్,న్యూట్రాన్ పరస్పరం నియంత్రించుకుంటాయి.వస్తువులు కూడా అలాగేపరమాణువులోనున్న ధనా వేశిత ప్రోటాన్,ఋణావేశితఎలక్ట్రాన్ వుంటాయి. ధ్రువాల మధ్య ఘర్షణ,ఐక్యత సమన్వయ వ్యక్తీకరణే మార్పులు కలిగిస్తుంది.మార్పు పదార్థ స్వతః లక్షణం.మారేదాన్నే పదార్థం అంటారు.గణిత ,బౌతిక ,రసాయన,జీవశాస్త్ర గ్రంధాలన్నీ మారుతుంటాయి.కొత్త విషయాలు వస్తుంటే పాతవాటిని త్యజిస్తుంటాయి. రోజు సైన్సు వేరు.రేపటి సైన్సు వేరు.నిన్న టి సైన్సు మరోవిధం.ఇలా మార్పే శాశ్వతం.          

Friday 27 April 2012

ప్రకృతి సూత్రాలు:రెండవ సార్వత్రిక నియమం


మనం  చూస్తున్న నేటి విశ్వం మహా విస్పోటనం అనబడే ఒక సంఘటన లో ఏర్పడింది.అప్పట్నుంచి విశ్వం పలు మార్పులకు లోనయి నేతిస్తితిలో వుంది.మహా విస్పోతనానికి ముందు కూడా విశ్వం వుంది.మరో తెలీని రూపం లో వుంది.
(The universe as we see it today originated from bingbang and has been gradually evolving and expanding.The universe must have existed even before the event of bigbang in an untraceable form.)
      నేటి  విశ్వం 1500  కోట్ల సం:క్రితం మహా విస్పోటనం ద్వారా ఏర్పడింది.అప్పుడే కాలము,స్థలము ఏర్పడ్డాయి .Bigbang జరిగినట్లు 1920  లో అలెగ్జాందర్ ఫ్రెడ్ మాన్ ,అబ్బే జార్జి లేమాట్రి   తర్వాత  1940 లో జార్జి గేమొల్ అనే ప్రసిద్ధ శాస్త్రవేత్తలు ప్రవేశ పెట్టారు.  1965 లో పెంజియాస్ ,రాబర్ట్ విల్సన్ అనే ఇద్దరు ఖగోళ శాస్త్రజ్ఞులు Bigbang  కు సాక్ష్యాధారాలు చూపారు.
                  భావవాదుల నమ్మకం ప్రకారం భూమి కేంద్రంగా గ్రహాలూ తిరుగుతాయని పై పొరలో  నక్షత్రాలు వుంటాయి.వారు చెప్పే గ్రహాల్లో సుర్యచంద్రులిరువురు వుంటారు.నవగ్రహాలలో రాహువు,కేతువు వుంటారు.
        కాని Bigbang  సిద్ధాంతం ప్రాయోగిక రుజువులకు నిలబడింది .విశ్వం తో పాటే కాలం ఏర్పడింది కాబట్టి '' సెకండ్స్ కి ప్రస్తుత బౌతిక విశ్వం ఏర్పడింది ప్లాంక్ సమయ కాలం లో (10 to the power of _43) గురుత్వ ,విద్యుద యస్కాంత,బలమైన,బలహీన కేంద్రకబలాలు ఏర్పడ్డాయి.తరువాత హైడ్రోజెన్  వాయువు ఏర్పడింది.
       సూర్య కుటుంబం వయస్సు   500 కోట్ల సం:వుంటుంది.భూమి మీద జీవం పుట్టి సుమారు 400 కోట్ల సం:లు అయివుంటుంది.కొన్ని విశ్వాసాల ఆధారంగా భూమి వయస్సు 6 వేల సం:లే .కాని వాస్తవంగా మనిషి  20 లక్షల సం:నుంచే భూమి పై వున్నాడు.అరిస్టాటిల్ భూమి చుట్టూ గ్రహాలూ తిరుగుతున్నాయని చెప్పిన విషయము     సుమారు 2000 సం:పాటు కొనసాగింది.క్రీ.. 150 లో  టొలెమి కూడా భూ కేంద్రక సిద్ధాంతం గురించే చెప్పాడు.1473 లో కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతం ప్రవేశ పెట్టాడు. సిద్ధాంతం విశ్వాసాలకు వ్యతిరేకంగా వుందని ఆయనను అనేక వ్యధలకు గురిచేశారు. 1548 లో జన్మించిన బ్రునో కోపెర్నికాస్ ను సమర్థిస్తూ ఇలాంటి సౌరమండలాలు ఇంకా ఉండవచ్చునన్నాడు.అందుకు 1600 సం :లో అతనిని సజీవదహనం చేసారు.గెలీలియో గురుత్వ సిద్ధాంతాన్ని తెలియ జేశాడు.కెప్లర్ గ్రహగతుల గురించి చెప్పాడు.ఇలా విశ్వ ఆవిర్భావం గురించి బలమైన ఆధారాలున్న సిద్దాంతాలున్నాయి .సైన్సు ప్రకారం విశ్వం తనంతతానుగా ఎప్పుడూ వుంది.Bigbang  కు ముందు కూడా విశ్వం వుండే వుండాలి. వర్తమాన దూర  _కాల చట్రం లో వివరించలేము.విశ్వం పలు మార్పులకు లోనవుతుంది.
      విశ్వాన్ని ఎవరు సృష్టించలేదని అది ఒక పదార్థ స్వతసిద్ధఘటన   లో రూపొందిందని అప్పట్నుంచి మార్పులకు లోనవుతుందని  సూత్ర సారాంశం.

Thursday 26 April 2012

ప్రకృతి సూత్రాలు-మొదటి సార్వత్రిక నియమం

   మొదటి నియమం :సహజ సంఘటనలు పరిశీలకుని ఇష్టానుసారం జరగవు.వాస్తవ మనుగడలో ఉన్నదాన్నే పరిశీలకులు గమనిస్తారు సంఘటనలు పరిశీలకుడు గమనించడం కోసం జరగవు.(Events Occur Independent of the Observer.Observatio May Perturb Perturb the Event but the Event Itself Occurs Independent of this Observation)
                    మనకు జ్ఞానం ఎలా కలుగుతుంది.పరిసరాలగురించి,విశ్వం గురించి మనం ఏ విధం గా పరిజ్ఞానం పొందు తాము.మేధావులు ఈ ప్రశ్నకు ఇచ్చే జవాబులు రెండు దృక్కోణాల్లో వుంటాయి.
              1)భావ  వాదం  2)బౌతిక వాదం 
1)భావ  వాదం :మనిషి ఆత్మ ప్రధానం.దీన్నే జీవాత్మ అంటారు.జీవాత్మను పరమాత్మ నియంత్రిస్తుంది. ప్రకృతి ,దేహం ,విశ్వం,సమాజం,జీవన్మరణాలు,సంఘతనలన్నే కల్పనే!వాస్తవాలు కావు.అంతా మిధ్య .జగమే మాయ అంటోంది.
2)బౌతిక వాదం:సైన్సు ప్రకారం భావవాదాన్ని ఏ కోశానా రుజువుచేయలేము.ఈ సృష్టి ఎల్లప్పుడూ వుంది.ప్రకృతి సంఘటనలు ఏదో అతీత శక్తి అభీష్టం మేరకు కాకుండా వాటికవే జరుగుతాయి.భూమి ఏర్పడ్డాకే మనిషి ఏర్పడ్డాడు మనిషి ఎదుగుదల,జ్ఞాన సముపార్జనా శక్తి,సామాజిక పరిణామం ఇవన్నీ మనిషి మనసుకు సంబందించక సహజ  సిద్ధంగా  జరుగుతూనే వుంటాయి.
                     మనిషి మనసు అనుకోవడం వలన  గ్రహణాలు,రేయి ,పగలు  చావు బ్రతుకులు కలగడం లేదు.ప్రకృతి సంఘటనలు ఒక నిర్నీతమైన చట్రాలలో పరిశీలకులందరికీ ఒకే విధం గా కనిపిస్తాయి సూర్యుడి చుట్టూ భూమి తిరగ టం  వలన రాత్రి పగలు ఏర్పడుతున్నాయనేది పరమ సత్యం.ఈ సూత్రం ప్రకారం దెయ్యాలు, భూతాలు అబద్ధం. ఎందు కంటే ఒక వ్యక్తికి కనిపించి మరో వ్యక్తికి కనిపించని లక్షణాలను దెయ్యాలకు ఆపాదిస్తారు.
               ఒక భౌతిక పరిశీలనా చట్రం పరిశీలకులందరికీ ఒకే విధమైన అనుభవాలు జరగాలనేది ఈ సూత్ర సారాంశం.

Tuesday 24 April 2012

ప్రకృతి సూత్రాలు _శాస్త్రీయ దృక్పథం


   
     మన భూమి వయస్సు 500  కోట్ల సంవత్సరాలుగా పరిగనిస్తారు.మొదటి  100 కోట్ల సంవత్సరాలు విపరీతమైన ఉష్ణోగ్రత వలన  భూమి  మరుగుతున్న ద్రవం గా ఉండటం వలన  అప్పటి ఆనవాళ్ళేమీ శిలా జాల రూపం లో ఏర్పడక పోవటం తో భూమి చరిత్రకు ఆనవాళ్ళేమీ లేవు.మొదటగా 400 కోట్ల  సం :క్రితం నీటిలో జీవం ఆవిర్భవించిందని కనుగొన్నారు.ఈ పరిణామ క్రమంలో భూమి మీద మానవ జాతి అవతరిం చి ఇరవై లక్షల సంవత్సరాలయ్యింది..ఇది ఒక ఉన్నత దశ.చేతి వ్రేళ్ళు  నాలుగు ఒక వైపు,బొటన వేలు వ్యతిరేక దిశలో మడవ గలిగే  నేర్పు వలన పని ముట్ల తయారీ,వాటి వాడకం అబ్బింది.
        ఆహారం,రక్షణ ,సంతానోత్పత్తి కోసం పరిసరాలను గమనించటం లో మనిషికి కుతూహలం ,ఆసక్తి కలి గాయి.వాటిని తన జీవన విధానం లో ఆచరిస్తూ ప్రకృతి పట్ల తన అవగాహనను తర్వాతి తరానికి అందిం చాడు .ఇలా పాత తరం అందించిన జ్ఞానం తీసుకొని ప్రతి తరం ప్రాపంచిక ,బౌగోళిక,అంతరిక్ష,ఇతర బౌతిక అంశాల పట్ల సవివరమైన అవగాహన ఏర్పరుచుకున్నాడు.కొన్ని లక్షల సంవత్సరాల పాటు  సంపాదించిన ఈ విజ్ఞాన సర్వస్వానికి మానవ జాతి సమిష్టి నిర్మాత.ఇలా సాదిం చుకున్నదే  విజ్ఞాన శాస్త్రం ఇందులో భౌతిక  శాస్త్రం,రసాయన శాస్త్రం,జీవ శాస్త్రం,ఖగోళ శాస్త్రం,వంటివి ప్రకృతిని వివరించే ప్రధాన విజ్ఞాన శాస్త్రాలు.
            ప్రతి శాస్త్రం లోను సూత్రాలు వుంటాయి.ఇవన్నీ ప్రకృతి సూత్రాలే! మనకు కనిపించే ప్రతి సంఘట న,దృగ్విషయానికి ఈ సూత్రాల ఆధారం గా వివరణ ఇవ్వ గలుగుతున్నాము.ఒక శాస్త్రం లోని సూత్రాలు మరో శాస్త్రం లోని సూత్రాలతో వైరుధ్యాన్ని ప్రదర్శించవు.ఈ సూత్రాల సమిష్టి తాత్విక  అవగాహనే శాస్త్రీయ దృక్పథం (scientific temper)అంటారు.వీటి గురించి  కనీస పరిజ్ఞానం శాస్త్రీయ అవగాహన కోరుకునే వారికి అవసరం.
       ఏ  సూత్రము లేని పరికరం,శాస్త్రం,సాంకేతిక విధానం వుండవు.ప్రతి వ్యక్తి సైన్సు సాధనాలను వాడక తప్పదు.మనం వాడే ప్రతి వస్తువు  t.v,radio,computer,cell phone,current, అన్ని లోహ వస్తువులు ,అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులు,చెక్క వస్తువులు,ఇంటి సామాగ్రి,అన్ని రవాణా సాధనాలు,అన్నిపరిశ్రమల  యంత్రాలు,ఇలా ప్రతిది శాస్త్ర,సాంకేతిక రంగ ఫలాలే!సైన్సు లేని జీవితాన్ని నేడు ఊహించలేము.
        ప్రజలు సైన్సు పరిజ్ఞానాన్ని పొందుటకు ఉత్సాహం చూపటం లేదు.ప్రశ్నించడం సైన్సు కు ప్రధాన లక్షణం.సైన్సు ద్వారా మానవ జీవనం ఎంతో మెరుగుపడింది.భారతదేశం లో ఒకప్పుడు సగటు వయస్సు 30 సం నేడు అది 60 సం పైగా అయింది. information,bio,nano,technology లు ఎంతగానో అభివృద్ది చెందాయి.కొన్ని లక్షల జంతు,వృక్ష జాతుల జీవిత పద్ధతుల్ని అన్వేషించారు.ఆరోగ్యం పై అత్యాధునిక స్థాయి చికిత్సలను అభివృద్ది చేసుకున్నాము.1960 వరకు భూమిపై  ఉన్న  సహజ,స్వతంత్ర  పదార్థాల కన్నా ఈ 44 సం లలోనే మానవుడు ఎక్కువ పదార్థాల్ని సృష్టించాడు.
                   సమాజాన్ని సైన్సు ప్రభావితం చేసింది,అలాగే సైన్సు ను సమాజం ప్రభావితం చేసింది .సమా జానికి ఆలోచనను,తాత్విక దృష్టిని ఇచ్చింది.తత్వశాస్త్రానికి పరాకాష్ట సత్యాన్వేషణ.ఇది తాత్విక దృష్టి ఉంటే నే వీలవుతుంది .సైన్సు ను అభివృద్ది చేసిన తాత్విక దృష్టి పేరే శాస్త్రీయ పద్ధతి.(method of science) అంటాము.శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలంటే శాస్త్రీయ పద్ధతి గురించి కనీస అవగాహన అవసరం సైన్సు పద్ధతికి,అశాస్త్రీయ పద్ధతికి ప్రధానం గా ఉన్న తేడా రుజువులు.సైన్సు వీటిని ప్రోత్సాహిస్తుంది .అశాస్త్రీయ భావాలు రుజువుల మీద ఆధారపడక గుడ్డిగా నమ్ముతుంటాయి.
         ఎక్కువమంది నమ్మినంత మాత్రాన నమ్మకం వాస్తవం కాదు.ఊహల ద్వారా ఏర్పడినవే నమ్మకా లు .ప్రయోగం ద్వారా పరిశీలనలోనే సత్యమేదో తెలుస్తుంది.ఉదాహరణకు బరువైన,తేలికైన రాళ్ళలో బరు వైనదే ముందు పడుతుందని అరిస్టాటిల్,క్రీ పు నాలుగవ శతాబ్దం లో అన్నాడు.క్రీ.శ పదహారవ శతాబ్దం లో గెలేలియో  రుజువు చేసే దాకా రెండు రాళ్ళు ఒకేసారి పడతాయని ప్రపంచానికి తెలియదు.శాస్త్రీయ పద్ధతి లోపరిశీలన అనేది మొదటి దశ.దీనిలో ఖాయం చేసుకోవడం కోసం కొలతలు వాడతాము.అలాగే ప్రశ్న రెండోది.ఎందుకు?ఏమిటి?ఎలా?ఎక్కడ?ఎవరు?ఎప్పుడు? అనే జిజ్ఞాసే సైన్సు కు ప్రేరకం.ప్రశ్న లోంచే విజ్ఞానం పుట్టింది.ఈ ప్రశ్న శాస్త్రీయం గా ఉండాలి.(scientific query).మూడో మెట్టు ఊహన!అంతకు ముందు  సైన్సు నిరూపించిన సిద్దాంతాలకు సూత్రాలకు ఈ ఊహలను ప్రయోగ పూర్వకంగా తేల్చుకోవాలి                                                                                                                బల్ల పరుపు భూమి అనే ఊహనుండి  గోలీయ భూమిగా భావించటం సైన్సు లో గొప్ప   విజయం.భూమి చుట్టూ గ్రహాలూ,నక్షత్రాలు తిరుగుతాయనే ఊహలకు వ్యతిరేకం గా ఆలోచించిన బ్రునో, హైపెశియా  హత్యకు గురికాగా గెలేయియో శిక్షిం పబడ్డాడు..కోపెర్నికాస్  ఎన్నో వేదనలను అనుభవిం చాడు .ఊహించడం మూడవ మెట్టు అయితే ఆ ఊహ తప్పని తేలితే  కొత్త ఊహలు చేపట్టాలి.ఆ ఊహను రుజువు చేయడమే సైన్సు పద్ధతిలో అత్యంత కీలక దశ .ప్రయోగం ద్వారా రుజువు కానిదేది సైన్సు పరిధి లోకి రాదు.రుజువు కానిది అశాస్త్రీయం అవుతుంది.
     జంతువుల ,పక్షుల దేహ నిర్మాణం లో కోట్ల సం నుంచి స్వల్పం గా మార్పులకు గురి అయ్యాయి.కాని మానవ శరీరం ఈ వేలసం లలోనే అనేక మార్పులకు లోనయింది.మానవుడు తన పరిశీలనలను ప్రయో గం ద్వారా రుజువు చేసుకొనడం వలన  ప్రకృతి నియమాలను ఖరారు చేసుకొనడం ద్వారా సైన్సును జీవి త విధానం లోనికి ఇముడ్చు కోగాలిగాడు.
                      ప్రయోగం ద్వారా రుజువైన తర్వాత మూడవ  దశలో పేర్కొన్న నమూనా సిద్ధాంత స్థాయికి చేరుకొ నడం శాస్త్రీయ పద్ధతి.ఇదే చివరి దశ.ఎన్నో సార్లు పరీక్షలకి,పరిశీ లనలకి,  సవాళ్ళకు నిలబడి నిలి చేదే ప్రకృతి నియ మం అవుతుంది.సైన్సు లో ఎన్ని వేల సుత్రాలున్న అవన్నీ మౌలికం గా  పద్దెనిమిది ప్రాథమిక సూత్రాల సమాహార మని ఆధునిక శాస్త్రజ్ఞులు రుజువు చేసారు.2000 సం ఆరంభం లో అంతర్జా తీయ స్థాయిలో జరిగిన శాస్త్రజ్ఞుల మహా సభలో ఈ సూత్రాలను తీర్మానించారు.వీటిని ప్రశ్నించే పరిశీల నలు,సైన్సు పద్ధతి ద్వారాప్రయోగ పూర్వకం గా మన కు తారస పడే వరకు ఈ సూత్రాలను మనం సత్యా లుగా ఆమోదిస్తాము.వీటినే శాస్త్రజ్ఞులు సమకాలీన శిఖరాగ్ర సూత్రాలుగా భావిస్తారు.ఈ సూత్రాలలో ఏ  ఒక్కదాన్ని లేదా కొన్నింటిని లేదా అన్నింటిని ప్రశ్నిం చే విధం గా నమ్మకాలు,ఆచారాలు,విశ్వాసాలు వుంటే అవి అశాస్త్రీయమని సైన్సు పద్ధతి అంటుంది.
                 ఈ సూత్రా;లతో ప్రతి వాదనను పోల్చుకోవాలి.ఆ వాదన ఈ సూత్రాలను ప్రశ్నించే దైతే రుజువు చేసుకోవాలి.రుజువు చేసుకోలేక పోతే  ఆ వాదనను తప్పుగా భావించుకోవాలి.అందుకే  18 ఈ  సూత్రాల ను rules of acceceptance  గా కాకుండా rules of exclusion  గా సైంటిస్ట్ లు పేర్కొంటారు.వీటి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన వుండాలి.ఒక్కొక్క  సూత్రాన్నిగురించి తెలుసుకొందాము.    

Sunday 22 April 2012

ప్రకృతి సూత్రాలు (LAWS OF NATURE)


                 ఈ విశ్వాన్ని సృష్టించిదెవరు?ముందుకు నడిపిస్తున్నదెవరు?దీన్ని ఎవరు శాసిస్తున్నారు?ఈ ప్రశ్నలన్నీ
మానవుడు ఈ ప్రకృతిని చూసి వేసినవి.ప్రకృతి అంత సహజంగా ఈ ప్రశ్నలు పుట్టాయి.ఈ ప్రశ్నలవలననే సైన్సు,చరిత్ర, మానవ నాగరికత పుట్టాయి.మరి వీటికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి?గణితం లాగా ఖచ్చితమయిన సమాధా నాలు వాటికున్నాయా?
              ఆధునిక సైన్సు పై ప్రశ్నలకు సమాధానాలు వున్నాయని అంటుంది.ఈ ప్రకృతి కేవలం  18 సూత్రాల మీద ఆధారపడి నడుస్తోందని నోబెల్ గ్రహీతలైన శాస్త్రవేత్త లంతా కలిసి వడబోసిన సిద్ధాంతీకరణ ఇది.ఈ సూత్రాల పరిధి దాటి  ప్రకృతి లో పరమానువునుంచి గేలక్సీ ల దాకా ఏదీ ఒక్కక్షణం కూడా మనుగడ సాగించలేవనేది ఈ సూత్రాలసారాంశం.            
            
                 ఇది వరంగల్  NIT లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఎ.రామచంద్రయ్య గారి రచించిన "ప్రకృతి సూత్రాలు" అనే పుస్తకం నుండి సేకరించినది . ఈ సూత్రాలను  బ్లాగులో పెడుతున్నాను సర్ అని అడిగిన వెంటనే సైన్సు అందరిదయ్యా అని ఓ.కే చేసిన ఈ పుస్తక రచయితకు జనవిజ్ఞాన వేదికకు ,ప్రజాశక్తి బుక్ హౌస్ కు  ధన్యవాదాలు.కాని పుస్తకం లోని ప్రధాన భావనను మాత్రమే తీసుకొని సరళంగా ప్రస్తావిస్తున్నాను.ఇది కేవలం శాస్త్ర ప్రచారం కోసం మాత్రమే !

శాస్త్రీయదృక్పథం

                              Developing Scientific Temper
               Humanism and Spirit of inquiry
               and Reform........
                                            Constitution of India
        శాస్త్రీయ దృక్పథాన్ని ,మానవతా దృక్కోణాన్ని 
        తార్కిక సత్యాన్వేషనా తత్పరతను,సంస్కర
        శీలాన్నిపెంపొందించుకోవటం ప్రతి భారత పౌరుడి విధి.
                                          భారత రాజ్యాంగం