శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Sunday 16 February 2014

నోబెల్ విజేత వెంకటరామన్ రామకృష్ణన్ మాటల్లో సైన్స్

                ఈ మధ్య కాలంలో నోబెల్ బహుమతి  సాధించిన భారతీయుడు వెంకట రామన్ రామకృష్ణన్ .భౌతిక శాస్త్రంలో phd చేసి,జీవ శాస్త్రంలో పరిశోధనలు చేసి  రసాయన శాస్త్రంలో నోబెల్ సాధించిన ప్రతిభావంతుడు  ఈయన . చదువు గురించి,సైన్స్ గురించి ఆయన మాటల్లోనే విందాం.
         "సైన్స్ మీద నాకు ఆసక్తి కలగడానికి మా ఉపాధ్యాయుడు టి .సి పటేల్ కారణం.ఆయన పుణ్యమా అని సైన్స్ లో ప్రాధమిక అంశాలను పూర్తిగా అవగాహన చేసుకోగలిగాను.యూనివర్సిటీ స్థాయిలో మా ప్రొఫెసర్స్ నాణ్య మైన విద్య చెప్పిన కారణంగానే నేనీ రోజు ఈ స్థాయికి చేరుకోగాలిగాను.బరోడా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చినా ఫిజిక్స్ లో నాకున్న ఆసక్తి కారణంగా మెడిసిన్ సీట్ వదులుకున్నాను. ఫిజిక్స్ లో phd చేస్తున్నప్పుడు www.scientificamerican.com scientificamerican magazine చదువుతుండే వాణ్ని సైన్స్ కు సంబంధించిన అద్భుత ఆవిష్కరణలు అందులో వ్రాసేవారు.వాటిలో ఎక్కువ భాగం జీవ శాస్త్రానికి చెందిన వ్యాసాలు  ఉండటం వల్ల నా దృష్టి ఫిజిక్స్ నుండి జీవ శాస్త్రం వైపు మళ్ళింది.జీవితంలో నన్ను ప్రభావితం చేసిన వారిలో ముఖ్య మైన వ్యక్తీ రైబొజొము ల అంశం పై పరిశోధనలకు పురికొల్పిన పీటర్ మూర్.
         భారత దేశంలో విద్యా వ్యవస్థ గురించి తలచుకుంటే బాధగా ఉంటుంది. పిల్లలకు ఎంతసేపు చదువే లోకం బళ్ళో ఇంట్లోtution లో చదువు..చదువు. ఆడుకోవడానికి,సృజనాత్మక శక్తిని పెంచుకోవడానికి సమయం ఎక్కడిది! పాఠ్యపుస్తకాలు కాకుండా  పుస్తకాలు చదివే అలవాటు,వళ్ళు అలిసిపోయేలా మైదానంలో ఆడుకోవడం ఇవేవీ ఇప్పటి పిల్లలకు తెలియకుండా పోతున్నాయి బట్టీ పట్టే చదివే  చదువులతో  సైన్స్ లో మనకు ప్రపంచస్థాయి పుర స్కారా లెక్కంన్నించి వస్తాయి.నా ఉద్దేశం ప్రకారం పిల్లకు ఎంత తక్కువ homework ఇస్తే అంత మంచిది. ప్రముఖ ఆర్ధిక వేత్త అమర్త్యసేన్ అసలు పిల్లలకు homework  వద్దంటాడు.బాల్యాన్ని హరించే కోచింగ్ సెంటర్స్ ను పూర్తిగా నిషేదించాలంటారు. ప్రతిదాన్ని ప్రశ్నించి తెలుసుకునే మనస్తత్వం,ఆటా,పాటా ...పిల్లల్లొ సృజనాత్మకతను పెంచుతా యని చెబుతారాయన. school లో టీచర్స్ చక్కగా అర్థ మయ్యేలా చెప్పగలిగితే మనం కూడా శ్రద్ధగా మనసు పెట్టి పాఠాలు వింటే కోచింగ్ సెంటర్ల అవసరమే ఉండదు.
          సైన్స్ విద్యార్థులకు నేనిచ్చే సలహా ఏమిటంటే మీకు సైన్స్ మీద ఎంతో ఇష్టం, తపన ,ఆరాధన ఉంటేనే ఆ సబ్జెక్టు తీసుకోండి .ఒక్క సైన్స్ అనే కాదు ఏ సబ్జెక్టు అయినా అంతే . మీకు ఆసక్తి ఉన్న చదువు చదివితేనే దానికి సార్ధకత" .
     విద్యార్థులూ! ఆయన చెప్పిన మాటలు విన్నారు కదా!పాటిస్తారు కదూ !schools యాజమాన్యాలు కూడా గ్రహించ వలసిన విషయాలు ఆయన చెప్పారు .
  (ఈ వ్యాసం ఈనాడు ఆదివారం అనుబంధం లోనిది , వారికి ధన్యవాదాలు )
  వెంకటరామన్ రామకృష్ణన్ http://www.nobelprize.org/nobel_prizes/chemistry/laureates/2009/ramakrishnan-bio.html
పై లింక్ లో ఆయన గురించి తెలుసుకోండి .

No comments:

Post a Comment